మూవీడెస్క్:జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకుల్లో ఎంతగానో ఆసక్తి రేపుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా దేవర కోసం సినీ ప్రేమికులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.
ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ ప్రారంభమవ్వగా, మిలియన్ల టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. టాలీవుడ్ లో ఇంత పెద్ద స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరగడం ఇదే మొదటిసారి.
అలాగే, తెలంగాణలో ఆరు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో, రాత్రి ఒంటి గంటకు కూడా 15 స్క్రీన్లలో దేవర సందడి కాబోతోంది.
ఇక మిగతా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లలో ఉదయం 4 గంటలకు షోలు వేయనున్నారని పేర్కొన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నాడు, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది.
సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.