మూవీడెస్క్:అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
‘ఎఫ్ 2’ మరియు ‘ఎఫ్ 3’ లాంటి హిట్ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ఇది. అయితే ఈసారి వెంకటేష్ సోలో హీరోగా కనిపించబోతుండటం విశేషం.
ఈ సినిమా క్రైమ్ కామెడీ జోనర్‌లో ఉంటుందని సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, సంక్రాంతి 2025కి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యిందని, నవంబర్ చివర్లో పూర్తి చేసే అవకాశం ఉందని టాక్.
జెట్ స్పీడ్ లో షూటింగ్ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై బయ్యర్లు, డిస్టిబ్యూటర్ల నుంచి మంచి ఆసక్తి వ్యక్తమవుతోంది.
అనిల్ రావిపూడి మునుపటి విజయాల నేపథ్యంలో, ఈ చిత్రానికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశముంది.