టాలీవుడ్: టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఢీ’ డాన్స్ షో కంటెస్టెంట్ శ్రేష్టి వర్మ చేసిన ఫిర్యాదు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. జానీ మాస్టర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని, బెదిరించి అత్యాచారం చేశాడని శ్రేష్టి ఆరోపించింది.
అంతేకాకుండా, తన మతాన్ని మార్చుకోవాలని బెదిరించడమే కాకుండా, జానీ భార్య కూడా తనను శారీరకంగా హింసించిందని ఆమె పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
శ్రేష్టి వర్మ తెలిపిన వివరాల ప్రకారం, జానీ మాస్టర్ షూటింగ్‌ల సమయంలో, తన నివాసంలో, అలాగే కేరవ్యాన్‌లో తనను పలుమార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని, పైగా అంగీకరించని సందర్భాల్లో సెట్స్ మీదే ఆమెను అవమానిస్తూ బూతులు తిట్టేవాడని చెప్పింది. ఈ ఆరోపణలు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియా మరియు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ఇప్పటివరకు జానీ మాస్టర్ ఎలాంటి స్పందన తెలపలేదు. కానీ, ఈ ఆరోపణలు అతడి సినీ మరియు రాజకీయ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి.
జనసేన అధిష్టానం ఈ ఆరోపణల దృష్ట్యా జానీ మాస్టర్‌ను పార్టీ కార్యక్రమాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని నిర్ణయించింది.
సోషల్ మీడియాలో పెల్లుబికుతున్న వ్యతిరేకత
ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, జానీ మాస్టర్‌పై సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, దీనిపై రాజకీయ రంగు పులమడానికి సాయశక్తులా కృషిచేస్తున్నారు. జనసేన నాయకత్వం వెంటనే జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని పార్టీ నుంచి శాశ్వతంగా వెళ్ళగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!
ఈ వివాదం నేపథ్యంలో, నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు తనను తీవ్రంగా కలచివేశాయని పూనమ్ పేర్కొంటూ, ‘‘ఇకపై జానీ ‘మాస్టర్’ అని పిలవాల్సిన అవసరం లేదు. మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంది,” అంటూ ట్వీట్ చేశారు. పూనమ్ కౌర్ ఈ ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆమె వ్యాఖ్యలకు విశేష మద్దతు తెలుపుతున్నారు.
జానీ మాస్టర్ కెరీర్ ప్రశ్నర్ధకం?
ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ కెరీర్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని ఇటు సినీ వర్గాల్లో అలాగే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ దోషివా తేలితే, అతడి కెరీర్ బహుశా ముగిసినట్టే అనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి.