అమరావతి: కరోనా వైరస్ సోకిన వారికి తక్షణ, మరియు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
పెరుగుతున్న కేసుల అవసరాలకు అనుగుణంగా కోవిడ్‌కు ప్రత్యేకంగా చికిత్స అందించే ఆసుపత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే 6 నెలల్లో దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సదుపాయాల కల్పన, పెంపు ఈ విధంగా ఉండబోతోంది:
- జిల్లా కోవిడ్ ఆసుపత్రుల పెంపు ద్వారా మొత్తంగా 39,051 బెడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో దాదాపు 4,300 ఐసీయూ బెడ్స్, 17,380 నాన్ ఐసీయూ బెడ్స్ (ఆక్సిజన్ సదుపాయం), నాన్‌ఐసీయూ బెడ్స్ 17,371 అందుబాటులో ఉన్నాయి. (క్వారంటైన్ బెడ్లు అదనం)
- మొత్తంగా శ్రీకాకుళంలో 12, విజయనగరంలో 7, విశాఖపట్నంలో 22, ఈస్ట్ గోదావరిలో 6, వెస్ట్ గోదావరిలో 9, కృష్ణాలో 13, గుంటూరులో 11, ప్రకాశంలో 9, నెల్లూరులో 7, చిత్తూరులో 12, అనంతపూరంలో 16, కడపలో 6, కర్నూలులో 7 ఆసుపత్రులు ఉన్నాయి.
- కోవిడ్ కేర్ సెంటర్లలో 72,711 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఉన్న 34,556 యాక్టివ్ కేసులకు (సమీక్ష సమయానికి) సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.