మూవీడెస్క్: ఒక్కోసారి పెద్ద హీరోల మధ్య సంక్రాంతి ఫెస్టివల్ లో సినిమాల పరంగా ఫైట్ నడుస్తూ ఉంటుంది.
ముఖ్యంగా మెగా, నందమూరి హీరోల మధ్య సినిమా పోరు అంటే ఎప్పుడు ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది.
గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బాలయ్య సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
ఈ రెండు కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. మరోసారి 2025 సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు ఒకేసారి రావడం ఖాయం అయ్యిందనే మాట వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉంటే బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ‘NBK109’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆ నెలలో ఎక్కువ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.
దీంతో బాలయ్యకి కలిసొచ్చే సంక్రాంతికి ‘NBK109’ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారంట. జనవరి 8న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.
అంటే సంక్రాంతి సీజన్ కి చిరంజీవి, బాలకృష్ణ కాంపిటేషన్ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.