మూవీడెస్క్: గతేడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది.
మ్యాడ్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముగ్గురు హీరోలు పంచెకట్టులో కనిపిస్తూ, పూర్తి కొత్త లుక్ తో ఆకట్టుకున్నారు.
ఈ లుక్‌ను చూసిన అభిమానులు, గత చిత్రం మ్యాడ్ కి, ఈ సీక్వెల్ లుక్కుకు తేడా ఉండడంతో, మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక సెప్టెంబర్ 20న సినిమా నుండి మొదటి పాట విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
తొలి సినిమా పాటలు మంచి హిట్ కావడంతో, ఈ సారి కూడా అదే స్థాయి సంగీతాన్ని అందించాలని భావిస్తున్నారు.
ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు అనుగుణంగా, ఈ సీక్వెల్ మరింత వినోదాన్ని అందిస్తుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.