fbpx
Friday, November 29, 2024
HomeAndhra Pradeshహోంమంత్రి అనితను కలిసిన నటి కాదంబరి జెత్వానీ

హోంమంత్రి అనితను కలిసిన నటి కాదంబరి జెత్వానీ

Actress- Kadambari -Jethwani- met -Home -Minister- Anita

అమరావతి: ముంబయి నటి కాదంబరి జెత్వానీ ఈ రోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను కలిసారు. అనంతరం ఆమె తన న్యాయవాదితో కలిసి మీడియాతో మాట్లాడారు. హోంమంత్రికి తన కష్టాలను వివరించామని, గతంలో పోలీసులు తనతో వ్యవహరించిన తీరును వివరించానని చెప్పారు.

తనపై పెట్టిన అక్రమ కేసు గురించి జెత్వానీ హోంమంత్రికి వివరించగా, కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. విజయవాడలో ఉన్న సమయంలో తనకు రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని హోంమంత్రిని అభ్యర్థించానని తెలిపారు.

హోంమంత్రి వంగలపూడి అనిత ఈ విషయాన్ని సానుకూలంగా తీసుకుని, తగిన చర్యలు తీసుకోవడానికి భరోసా ఇచ్చినట్లు జెత్వానీ పేర్కొన్నారు.

ఈ అంశంలో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కుక్కల విద్యాసాగర్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. విద్యాసాగర్‌ను ఏ1గా పేర్కొంటూ, క్రైమ్ నంబర్ 469/2024 కింద పలు సెక్షన్లను చేర్చారు.

విద్యాసాగర్‌పై 192, 211, 218, 220, 354(డీ), 467, 420, 469, 471 సెక్షన్లతో పాటు, ఐటీ యాక్ట్ 66(ఏ) కింద కూడా కేసు పెట్టారు. ఈ కేసు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి పాఠకులకు విదితమే.

అయితే, కొత్త చట్టాలు ‘న్యాయ సంహిత (BNS)’, ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNS)’, ‘భారతీయ సాక్ష్య అధినియం (BSA)’ అమలులోకి వచ్చినప్పటికీ, కాదంబరి జెత్వానీపై అక్రమ కేసు నమోదు చేసిన ఘటన జులై నెలకు ముందు జరగడంతో, పోలీసులు పాత భారతీయ న్యాయ విధానంలో ఉన్న సెక్షన్లనే ఉపయోగించారు.

ఈ వివాదంలో మరిన్ని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. హోంమంత్రి అనితతో సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వం, కాదంబరి జెత్వానీ చర్యలపై స్పష్టత రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular