ప్యాంగ్‌యాంగ్: భారత దేస ప్రభుత్వం ఉత్తర కొరియాకు భారీ సాయాన్ని అందిచనుంది. క్షయ వ్యాధి నిరోధక ఔషధాలను భారత్ ఉత్తర కొరియాకు పంపనుంది. ప్రస్తుతం ఉత్తరకొరియాలో క్షయ వ్యాధికి సంబంధిచిన ఔషధాల కొరత చాలా ఉంది.
దీంతో కొరియాకు ఔషధాలు పంపి, సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విజ్ఞప్తి చేసింది. దానికి భారత్ సానుకూలంగా స్పందించింది. సుమారు మిలియన్ డాలర్ల (సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు) విలువైన క్షయ నిరోధక మందులను నార్త్ కొరియాకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఉత్తర కొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని కూడా తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వినతి మేరకు ఔషధాలను పంపుతామని తెలియజేసింది.
ఇదిలా ఉండగా ఉత్తరకొరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వీటిని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి ఎడ్విన్ సల్వడార్ ఆధ్వర్యంలో కొరియాకు అందజేసినట్లు ప్యాంగ్‌యాంగ్‌లోని భారత ఎంబసీ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది.