అమరావతి: ఉచిత గ్యాస్ పథకం అమలు! ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులను పురస్కరించుకుని, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల వేళ ఇచ్చిన ఉచిత గ్యాస్ హామీని దీపావళి నాటికి అమలు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే, హామీల ప్రకారం సంక్షేమ పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు సమస్యల పరిష్కారానికి ఆజ్యం పోసినట్టు తెలిపారు.
విజయవాడ మరియు ఇతర ప్రాంతాల్లొ వచ్చిన వరదల బాధితులందరికీ సహాయం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఆ చట్ట ప్రకారమే శిక్షిస్తామని హెచ్చరించారు.
చట్టాన్ని పరిరక్షించేందుకు సంబంధిత వ్యవస్థలు ఉన్నాయని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
అలాగే, కూటమి పార్టీల సర్దుబాటుపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సమన్వయమే భవిష్యత్తులో కూడా కొనసాగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు సాగాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా ఆయన కోరారు.
అన్ని రకాల నష్ట పోయిన ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవ్వాలంటే, సుదీర్ఘకాలం ఒకే ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు పలు విష ప్రచారాలు చేస్తూనే ఉన్నారని, మనం చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైనే ఉందని అభిప్రాయపడ్డారు.
కూటమి ఎమ్మెల్యేలకు, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.