మూవీడెస్క్: ఓటీటీ లో అంటే ప్రేక్షకులు ఇంట్లో తీరిగ్గా కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు. అదే థియేటర్స్ లోకి వెళ్తే ఒక్కసారి టికెట్ కొనుక్కుంటే 2, 3 గంటలైనా మూవీని చూడాల్సిందే.
అలాగే సినిమాని ప్రేక్షకులు చూసే విధానం కూడా చాలా వరకు మారిపోయింది.
ప్రస్తుతం ఎక్కువ మంది మూవీలో కథ ఉందా, క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయా, నేరేషన్ ఎంగేజింగ్ గా ఉందా అని చూస్తున్నారు.
సాంగ్స్ కూడా సిచువేషన్ కి తగ్గట్లు ఉండాలని కోరుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లో కథలు పెద్దగా ఇష్టపడటం లేదు.
అందుకే కథలు, క్యారెక్టర్ ఎలివేషన్స్ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్త తీసుకోవాలనే మాట వినిపిస్తోంది.
ముఖ్యంగా ఓటీటీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కథలు సిద్ధం చేసుకోవాలని, నేరేషన్ లో స్టోరీ డీటెయిలింగ్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.
లేదంటే మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా ట్రోలింగ్ ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత నెల రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఎలివేషన్ కోసం బీవీఎస్ రవితో హరీష్ శంకర్ ఒక డైలాగ్ చెప్పిస్తాడు.
ఈ డైలాగ్ కి థియేటర్స్ లో కొంత రెస్పాన్స్ వచ్చిన ఓటీటీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడలేదు.
హీరో క్యారెక్టర్ ఎలివేషన్ అంటే పవర్ ఫుల్ గా ఉండాలని, ఎలా పడితే అలా డైలాగ్స్ రాయకూడదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అలాగే సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాక అందులో ఉండే మైనర్ లోపలని సైతం కొంతమంది పాయింట్ అవుట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో థియేటర్స్ తో పాటు ఓటీటీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కథలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది.