మూవీడెస్క్: టాలీవుడ్‌లో తన అందమైన నటనతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి, ప్రస్తుతం ఫ్యాన్స్‌కు మంచి సర్ప్రైజ్ అందించనున్నారు.
‘భాగమతి’ సినిమా సక్సెస్ తర్వాత, అనుష్క తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
‘భాగమతి’ లో అనుష్క నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో ఆమె రెండు విభిన్న షేడ్స్‌లో నటించింది, ఆ పాత్రలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించింది.
థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు అశోక్ ఈ కథను అద్భుతంగా నేరేట్ చేసి సూపర్ హిట్ అందించారు.
అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నది, కానీ ‘భాగమతి’ సీక్వెల్ విషయం అయితే మరింత ఆసక్తిని సృష్టిస్తోంది.
అశోక్ సీక్వెల్‌కి ఇంటరెస్టింగ్ కథ సిద్ధం చేసి, అనుష్కకి వినిపించాడని టాక్ ఉంది. ఆమె కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని సమాచారం.
యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయని అంటున్నారు. ‘భాగమతి’ సీక్వెల్ కూడా 100 కోట్ల కలెక్షన్స్ ను చేరుకునే అవకాశముందని అనుష్క ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
అయితే, ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.