చెన్నై: India vs Bangladesh Test మొదటి రోజు స్కోరు 339/6 తో రెండవ రోజు ఆట మొదలు పెట్టిన భారత్ 376 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, రవింద్ర జడేజా 86 పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో హసున్ మహ్మూద్ 5 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.
బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపనర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
షకిబ్ ఉల్ హసన్ 32 పరుగులు చేయగా, హసన్ మిరాజ్ 27, లిటన్ దాస్ 22 పరుగులు చేశారు. మిగతా అందరూ త్వరగా పెవిలియన్ చేరగా బంగ్లా 149 పరుగులకు ఆలౌట్ అయింది.
బూమ్రా 4 వికెట్లు, సిరాజ్, జడేజా, ఆకాష్ దీప్ చెరో 2 వికెట్లు తీసి బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. విరాట్ 17 పరుగులకే అవుటయ్యారు.
ఆట ముగిసే సమయానికి శుభ్మన్ 33, రిషభ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉండాగా భారత్ 81 పరుగులు చేసి 308 పరుగుల లీడ్ లో ఉంది.