టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా కొంచెం నిలదొక్కుకున్నాక అందరూ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు మొదటి ప్రయత్నం లోనే సక్సెస్ సాధించి ఆ సక్సెస్ పైన ఇంకా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తారు. కొందరు ఆ మాస్ ఇమేజ్ కోసం దండయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ మాస్ చట్రంలో పడి మూస సినిమాలు తీసి కనుమరుగు అయిన వాళ్ళు కనుమరుగు అవ్వబోతున్న వాళ్ళు కూడా చాల మంది హీరోలే ఉన్నారు ఇపుడు ఇండస్ట్రీ లో. మొదటి నుండి లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసి ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర అయిన నాగ శౌర్య మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అశ్వద్ధామ లాంటి సినిమాతో తానే స్టోరీ రాసి మాస్ హీరో గా నిలదొక్కుకునేందుకు తొలి ప్రయత్నం చేసాడు. సినిమా ఫలితం హిట్ అవనప్పటికీ శౌర్య మాత్రం నిరాశ పరచలేదు.
ప్రస్తుతం నాగ శౌర్య తన 20 వ సినిమాగా ‘సుబ్రహ్మణ్యపురం’ డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధిన ఒక ప్రీ లుక్ ని సినిమా టీం విడుదల చేసింది. ఆ ప్రీ లుక్ లో శౌర్య చూపించిన అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఫాన్స్ ఫిదా ఐపోతున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ జూలై 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం సమకూర్చబోతున్నారు. హీరో నాగ శౌర్య ఈ సినిమా ప్రీ లుక్ షేర్ చేస్తూ మరుగున పడినఒక ప్రాచీన ఆటతో మిమ్మల్ని కలవబోతున్నాను అని తెలిపారు. ఆట ఎపుడూ ఒకేలా ఉండదు అని షేర్ చేసిన పిక్చర్ ని బట్టి చూస్తుంటే కలరి పట్టు నో లేదా ముష్టి యుద్ధం తాలూకు ఆట అయ్యి ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు.