మూవీడెస్క్: ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్: రివ్యూ! థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన వెబ్ సిరీస్ ల పట్ల ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తుండటంతో, ఈ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడుతున్నాయి.
ఆ నేపథ్యంలో ‘హాట్‌స్టార్‘ ఫ్లాట్‌ఫామ్‌పై వచ్చిన తాజా వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సిరీస్ కి అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్‌లతో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సిరీస్ కథ, ప్రధానంగా డాక్టర్ విష్వక్సేన్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను పదేళ్లుగా ‘మోక్ష ఐలాండ్’ లో ఉంటూ, పరిశోధనలు చేస్తుంటాడు.
అతను విమాన ప్రమాదంలో మరణించాడని వార్త వస్తుంది, కానీ కొంతమందికి అతని లేఖలు వస్తాయి.
ఈ లేఖల్లో, వాళ్లు అతని వారసులని, అతని ఆస్తి వారిదని చెబుతూ, అందరినీ ‘మోక్ష ఐలాండ్’ కి పిలుస్తాడు.
అలా వారసులంతా ఐలాండ్‌కు చేరుకుంటారు, అక్కడ వారికి ఒక వారం రోజుల పాటు ఉండాల్సి ఉంటుందని, ఆస్తిని సమానంగా పంచిపెట్టబడుతుందని తెలుస్తుంది.
కానీ ఆ రాత్రి నుంచి వారిలో ఒక్కొక్కరూ అదృశ్యమవుతుండటంతో, అందరూ భయపడిపోతారు. విక్రమ్, ఝాన్సీ అనే ఇద్దరు వ్యక్తులు ఆ రహస్యాన్ని పరిశోధించటం ప్రారంభిస్తారు.
ఈ వెబ్ సిరీస్ మొదట్లో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ప్రధానమైన పాత్రల పరంగా బలహీనంగా తయారైంది.
పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సన్నివేశాలు సరైన రీతిలో నిర్మించకపోవడం వల్ల ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయింది.
మొత్తం మీద, సీరీస్ నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ, కధనం, స్క్రిప్ట్ పరంగా తక్కువగా అనిపిస్తుంది.