fbpx
Friday, October 18, 2024
HomeBig Storyప్రముఖ సంస్థల సీఈఓలతో ప్రధాని భేటీ!

ప్రముఖ సంస్థల సీఈఓలతో ప్రధాని భేటీ!

INDIAN-PM-MEET-CEOs-OF-REPUTED-COMPANIES-AT-MIT
INDIAN-PM-MEET-CEOs-OF-REPUTED-COMPANIES-AT-MIT

న్యూయార్క్: ప్రముఖ సంస్థల సీఈఓలతో ప్రధాని భేటీ అయిఎ కీలక రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం అమెరికా MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లో జరిగింది. గూగుల్, ఎన్విడియా, క్వాల్కామ్, ఇన్ఫోసిస్ వంటి టెక్ దిగ్గజాల 15 మంది సీఈఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ రౌండ్టేబుల్ సమావేశంలో, భారతదేశంలో టెక్నాలజీ అభివృద్ధి, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఈ సమావేశం ద్వారా భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడంపై ప్రధాన మంత్రి మోడీ దృష్టి పెట్టారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో ఆమోన్ వంటి ప్రముఖులు ప్రధానమంత్రి మోడీతో టెక్నాలజీ రంగంలో భారత్ తో సహకారం గురించి ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ X లో పోస్టు చేస్తూ, “న్యూయార్క్‌లో టెక్ సీఈఓలతో సార్ధకమైన రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.

టెక్నాలజీ, ఇన్నోవేషన్, మరియు ఇతర అంశాలపై చర్చించాం. ఈ రంగంలో భారత్ చేసిన పురోగతిని ప్రస్తావించాను. భారత పట్ల ఎంతో ఆశాభావం కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ంఏఆ) ఒక ప్రకటనలో, ఈ రౌండ్టేబుల్ సమావేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆఈ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ టెక్నాలజీలతో సహా ఆధునిక రంగాలపై కేంద్రీకృతమైందని తెలిపింది.

ప్రధాన మంత్రితో కలిసి సీఈఓలు గ్లోబల్ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్ పై లోతైన చర్చలు జరిపారు.

ఈ ఆధునిక టెక్నాలజీలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో, ప్రజల శ్రేయస్సుకు ఎలా దోహదపడుతున్నాయన్నది చర్చకు వచ్చింది.

గ్లోబల్ ఎకానమీ మరియు మానవ అభివృద్ధిని విప్లవాత్మకంగా మార్చగల ఇన్నోవేషన్ల కోసం టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారన్న అంశంపై చర్చ జరిగింది” అని ంఏఆ తెలిపింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఆఈ) విషయానికి వస్తే, ప్రధాని మోడీ “ఆఈ ఫొర్ ఆల్ల్” అనే నినాదం ద్వారా, దాని నైతిక మరియు బాధ్యతాయుత వినియోగంపై భారత్ విధానాన్ని ఉద్ఘాటించారు.

ప్రధాన మంత్రి మోడీ సీఈఓలకు భారత్‌లో మేధో సంపత్తి హక్కులను రక్షించడంపై ప్రభుత్వ బలమైన కట్టుబాటును పునరుద్ఘాటించారు మరియు టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్లకు అనుకూల వాతావరణాన్ని కల్పించడంపై నిశ్చయబద్ధతను తెలియజేశారు.

భారతదేశ వృద్ధి పథంలో వ్యాపార నాయకులు లాభపడాలని సూచించారు. అలాగే, భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగల సామర్థ్యాన్ని ఆయన ప్రస్తావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular