fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsహరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఫిక్స్!

హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఫిక్స్!

HARI-HARA-VEERA-MALLU-RELEASE-DATE-FIXED
HARI-HARA-VEERA-MALLU-RELEASE-DATE-FIXED

మూవీడెస్క్: హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ శుభవార్త!

కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ చిత్ర షూటింగ్ కరోనా మహమ్మారి ప్రారంభానికి ముందే మొదలైంది.

అయితే తాజాగా, పవన్ కళ్యాణ్ త్వరగా షూటింగ్ పూర్తిచేసి సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ నిర్మాతలు చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు: హరి హర వీర మల్లు చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవనుంది.

అయితే, ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని, మొదటి భాగానికి ‘స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ అని పేరు పెట్టగా, రెండవ భాగం పేరు షూట్ తర్వాత జరుగుతుందని తెలుస్తోంది.

కాగా, ఈ చిత్ర దర్శకుడిగా సినిమాను ప్రారంభించిన క్రిష్ జాగర్లమూడి మధ్యలోనే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

ఇప్పుడు మిగిలి ఉన్న మిగతా షూటింగ్ భాగాన్ని నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నాడు.

సోమవారం ఈ చిత్ర షూటింగ్ విజయవాడ లో ప్రారంభమైంది. దీనితో మేకర్స్ విడుదల తేదీతో కూడిన పోస్టర్ విడుదల చేశారు.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో ఆకట్టుకోనున్నాడు.

ఈ పీరియాడిక్ డ్రామా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి, సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందిస్తున్నారు.

ఏఎమ్ రత్నం ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ‘OG’ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్‌లు కూడా పూర్తి చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular