fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsయూఎస్ లో దేవర ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందంటే?

యూఎస్ లో దేవర ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందంటే?

OVERSEAS-COLLECTIONS-FOR-DEVARA-EXPECTED-TO-BE-HIGH
OVERSEAS-COLLECTIONS-FOR-DEVARA-EXPECTED-TO-BE-HIGH

మూవీడెస్క్: దేవర మూవీ వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. యూఎస్ లో ‘దేవర’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి.

సెప్టెంబర్ 26న ‘దేవర’ మూవీ స్పెషల్ ప్రీమియర్ షోలతో యూఎస్ లో రిలీజ్ కాబోతోంది. ఈ ప్రీమియర్ షోలకి టికెట్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.

మరో వైపు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నార్త్ అమెరికాలో ‘దేవర’ సినిమాకి 2 మిలియన్ డాలర్స్ వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

‘దేవర’ సెకండ్ ట్రైలర్ తో వచ్చే రెస్పాన్స్ బట్టి అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరుగుతాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే యూఎస్ లో ‘దేవర’ మొదటి వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనే దానిపై ట్రేడ్ పండితులు కొన్ని అంచనాలు వేస్తున్నారు.

‘దేవర’ మూవీ మొదటి వారాంతంలో 4 మిలియన్ డాలర్స్ వరకు వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారు.

మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మొదటి వారాంతంలో కలెక్షన్స్ 5 మిలియన్స్ క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఇప్పటికే మూవీ పైన ఉన్న హైప్, పాజిటివ్ వైబ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ మొదటిరోజు అందుకోవడం గ్యారెంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

‘దేవర’ ప్రీమియర్ షోల కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నారు. అక్కడ రెండు ప్రాంతాలలో ప్రీమియర్ షోలు వేసే థియేటర్స్ కి తారక్ వెళ్లి ఫ్యాన్స్ తో ముచ్చటించనున్నారు.

ఇది కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ పెరగడానికి కారణం అవుతుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular