మూవీడెస్క్: మాస్ మహారాజ్ రవితేజ సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు, ఆయన పిల్లలు మోక్షద, మహాధన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
అయితే తండ్రి బాటలో నటనకు మాత్రమే పరిమితం కాకుండా, వారు కొత్త దారిలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
మోక్షద నిర్మాతగా మారాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో టెక్నీక్స్ నేర్చుకుంటూ, తనకంటూ ప్రత్యేక బ్యానర్ స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తొలిసారి నిర్మాతగా శ్రీవిష్ణుతో సినిమా చేయాలని ఆలోచనలో ఉంది. రవితేజ మొదట ఈ నిర్ణయానికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, చివరికి తన కూతురికి మద్దతు ఇచ్చారని సమాచారం.
మహాధన్ విషయానికి వస్తే, అతను నటనలో కాకుండా దర్శకత్వంపై ఆసక్తి చూపుతున్నాడు. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ అంటే మహాధన్ కు చాలా ఇష్టం అని టాక్.
అందుకే, అతని వద్ద అసిస్టెంట్ గా చేరి, కొన్ని సినిమాలకు వర్క్ చేస్తూ, దర్శకత్వంలో తన కెరియర్‌ను కొనసాగించాలనే అభిప్రాయంలో ఉన్నాడని వినిపిస్తోంది.
మొత్తానికి, రవితేజ పిల్లలు తండ్రి కంటే భిన్నమైన దారిలో వెళ్ళాలని నిర్ణయించుకోవడం విశేషం.