fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshసొంత యూట్యూబ్ ఛానల్‌లో రోజాకు షాక్‌: ఊహించని ఫలితాలు!

సొంత యూట్యూబ్ ఛానల్‌లో రోజాకు షాక్‌: ఊహించని ఫలితాలు!

A -shock- to- Roja -her- own- YouTube- channel- unexpected- results

తిరుపతి: సొంత యూట్యూబ్ ఛానల్‌లో రోజాకు షాక్‌: ఊహించని ఫలితాలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా తన సొంత యూట్యూబ్ ఛానల్‌లో నిర్వహించిన ఒక సర్వేలో అనుకోని షాక్ ఎదుర్కొన్నారు. రోజా తిరుమల లడ్డూ అంశంపై ఆన్‌లైన్ పోల్ నిర్వహించారు. అయితే, ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు ఆమెకు కంగు తినిపించాయనే చెప్పవచ్చు.

ఏమిటీ సర్వే?

రోజా చేపట్టిన సర్వేలో “తిరుమల లడ్డూను కల్తీ చేసింది ఎవరు?” అనే ప్రశ్నను అడగగా, 74 శాతం మంది జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అలాగే, “తిరుమల ఆలయం ఎవరి పాలనలో బాగుంది?” అనే ప్రశ్నకు 77 శాతం మంది చంద్రబాబు నాయుడు పాలనలో ఆలయం బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా, ఆమె యూట్యూబ్ చానెల్‌లో నిర్వహించిన పోల్‌లో వచ్చిన ఫలితాలు రోజాకు ఊహించని షాక్ ఇచ్చాయి.

ఆన్లైన్ పోల్ వెనుక కథ:

తిరుమల లడ్డూ అంశం దేశవ్యాప్త సంచలనంగా మారి, వైసీపీని సెల్ఫ్ డిఫెన్సులో పడేసిన ఈ పరిస్థితులలో, రోజా తన యూట్యూబ్ ఛానల్ చందాదారుల మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నంలో ఈ సర్వే నిర్వచినట్లు అర్ధం అవుతోంది. కానీ.. ఈ సర్వే ఫలితాలు మాత్రం రోజాకు, వైసీపీకి ఊహించని షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular