మూవీడెస్క్: ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తూ, తన ప్రత్యేకమైన ‘సినిమాటిక్ యూనివర్స్’ను సృష్టిస్తున్నాడు.
హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని సాధించిన ఆయన, ఈ యూనివర్స్ లో మొత్తం 10 సినిమాలు చేయాలని ప్లాన్ చేశాడు.
ఇందులో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ, అలాగే జై హనుమాన్ వంటి పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.
తాజాగా, కార్తీ నటించిన సత్యం సుందరం ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రశాంత్ వర్మ, తన యూనివర్స్ లో కార్తీ కోసం ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కార్తీకి కథ చెప్పడానికి చెన్నై వెళ్లానని, ఇప్పుడు అతడి కన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.
ఈ కామెంట్స్ తో, ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో కార్తీ నటించబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
ఇది ఒక్కటే కాకుండా, ప్రశాంత్ వర్మ 96 మూవీ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆ చిత్రంలోని ప్రేమ్ కుమార్ దర్శకత్వం, గోవింద్ వసంత్ సంగీతం తనకు ఎంతగానో నచ్చాయన్నారు.
ఇప్పుడు మరలా ఆ కాంబినేషన్ లో సినిమా రావడంతో, తనకు చూడాలనే క్యూరియాసిటీ ఉందని పేర్కొన్నారు.