మూవీడెస్క్: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మరియు యూట్యూబర్ హర్ష సాయి పై ఒక అమ్మాయి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఆ కేసు ఇప్పుడు టాలీవుడ్ సహా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఫ్రెండ్‌గా పరిచయమై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపణలు చేయగా, హర్ష సాయి లాయర్ టి. చిరంజీవి ఈ ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు.
తాజాగా హర్ష సాయి లాయర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
తన క్లయింట్ హర్ష సాయి మీద ఉన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, డబ్బు కోసమే బాధితురాలు ఈ వ్యవహారాన్ని ఇలా చేస్తున్నారని లాయర్ చెప్పారు.
హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్‌గా మిలియన్ల వ్యూస్‌తో ఇప్పటికే మంచి పాపులారిటీతో ఉన్నాడని, ఇలాంటి ఆరోపణలు అతనికి అవసరం లేదని వ్యాఖ్యానించారు.
లాయర్ చిరంజీవి ప్రకటన ప్రకారం, ఈ కేసు హర్ష సాయి కెరీర్‌ను, పేరును దెబ్బతీసేందుకు ఉద్దేశించినట్లు కనిపిస్తోంది.
అలాగే హర్ష సాయి ఎక్కడికి పరారవ్వలేదని, తన ఫాదర్‌పై కూడా నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన వెల్లడించారు.
ఇక హర్షసాయి మాత్రం ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు.
కేవలం సోషల్ మీడియాలో మాత్రమే తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరి హర్షసాయి రాబోయే రోజుల్లో కేసుపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.