అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం లో ఆంధ్రప్రదేశ్ CID, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాన్ని బహిర్గతం చేసింది.
ఈ కుంభకోణం రాష్ట్రంలోని మద్యం పరిశ్రమలో విస్తృత స్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందని ఛీడ్ వాదన.
కాగా, ఈ కేసు విచారణలో వేల కోట్ల రూపాయల నిధులను నిశితంగా పరిశీలించిన తరువాత, 90% పైగా కాంట్రాక్టులు ప్రభుత్వ అధికారులకు మరియు వారి అనుచరులకు చెందిన కంపెనీలకే ఇచ్చినట్లు ధృవీకరించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మద్యం ధరలను భారీగా పెంచి, కొంతమంది సరఫరాదారులకు అన్యాయం చేయడమే కాక, అక్రమ లాభాలను కల్పించిందని దర్యాప్తు నివేదికలో తేలింది.
ఛీడ్ అధికారులు విజయవాడ ప్రసాదంపాడు ప్రాంతంలో ఉన్న బేవరేజెస్ కార్పొరేషన్, డిస్టిలరీలు, బ్రూవరీలను పూర్తిగా తనిఖీ చేశారు.
గత ప్రభుతం హయాంలో ఐదేళ్లకు సంబంధించిన కొనుగోలు ఆర్డర్లు, ధరల నమోదు మరియు చెల్లింపు రికార్డులను కూడా పరిశీలించారు.
అయితే, ఈ కుంభకోణంలో నంద్యాల SPY ఆగ్రో ఇండస్ట్రీస్‌ను నియంత్రించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు.
అదనంగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సంబంధించిన ‘అడాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్’కు సొంత డిస్టిలరీ లేకపోయినా కూడా ఆ కంపెనీ పలు సరఫరా ఆర్డర్లను పొందింది.
APSBCLలో 100కి పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయినప్పటికీ, కేవలం 10 కంపెనీలకు మాత్రమే 90% పైగా కొనుగోలు ఆర్డర్లు కేటాయించడం జరిగినట్లు విచారణలో బహిర్గతమైంది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ కంపెనీలు, పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశాయని, ఇది పూర్వనియోజితంగా జరిగిన అక్రమ కుట్రగా భావిస్తున్నారు.
APSBCL, గత ఐదేళ్లలో ఈ సరఫరాదారులకు సుమారు రూ.15,000 కోట్ల వరకు చెల్లించినట్లు ఛీడ్ తన నివేదికలో తెలిపింది.
అయితే, ఈ మొత్తంలో చాలా భాగం, మాజీ ప్రభుత్వ అధికారులకు చెందిన కంపెనీలకు వెళ్లినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దర్యాప్తులో భాగంగా అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, JR అసోసియేట్స్, SJN షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, MS బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటిని బయోప్రొడక్ట్స్ మరియు శర్వాణి ఆల్కో బ్రూవరీస్ వంటి కంపెనీలపై ఛీడ్ అధికారులు దృష్టి పెట్టారు.
ఈ కంపెనీల వెనుక ఉన్న వ్యక్తులు మరియు వీరు మద్యం సరఫరా ఆర్డర్లు పొందడంలో ఎందుకు ప్రాధాన్యత పొందారనే అంశాలను ఛీడ్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.