మూవీడెస్క్: విజయ్ దేవరకొండ గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖుషి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న, విజయ్ నెక్స్ట్ ఎలాగైనా సాలీడ్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు.
ఇప్పుడు అందరి దృష్టి VD12 మీద ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే షూటింగ్ మెజారిటీ భాగం పూర్తవడంతో, వచ్చే ఏడాది మార్చి 28న సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా అదే డేట్ కి ప్లాన్ అవుతుండడంతో, పోటీ అనివార్యం అయింది. నిర్మాతలు ఇప్పుడు కొత్త విడుదల తేదీ కోసం అన్వేషిస్తున్నారు.
ఇక ఏప్రిల్ లో వరుసగా మరికొన్ని పెద్ద సినిమాలు వస్తుండడంతో VD12 కి సోలో డేట్ దొరకడం కష్టం అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏదేమైనా మంచి సోలో డేట్ కోసమే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఏప్రిల్ లో కుదరకపోతే మే నెలలో VD12 ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.