బాలీవుడ్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీస్ లో నేపాటిసమ్ గురించి ఇండస్ట్రీస్ లో ఉన్న గ్రూపుల గురించి చాలా వాదనలు వినపడుతున్నాయి. ఇలాంటి అనుభవాలు అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళకో లేదా కొత్తగా ఎదుగుతున్నవాళ్ళకో వస్తుంది అనుకుంటాం. కానీ ఏ ఆర్ రెహమాన్ లాంటి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ కి కూడా ఈ కష్టాలు తప్పట్లేదని రెహమాన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది.మొజార్ట్ అఫ్ మద్రాస్ గా పిలవబడే ఏ ఆర్ రెహమాన్ తమిళ్ సినిమాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు తీసాడు. కానీ గత 10 సంవత్సరాలుగా హిందీ లో సినిమాలు తక్కువ అయ్యాయి.
సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా ‘దిల్ బేచారా’ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్. ఈ సినిమా డైరెక్టర్ ముకేశ్ చాబ్రాతో మ్యూజిక్ డిస్కషన్స్ లో ఉన్నపుడు ముకేశ్ చాబ్రాని కొందరు బెదిరించారని, రెహమాన్ ట్యూన్స్ చాలా ఆలస్యంగా ఇస్తాడని దాని వాళ్ళ సినిమా ఆలస్యం ఐతుంది అతని దగ్గరకి వెళ్లోద్దని తనకి కొందరు సజెస్ట్ చేసారని రెహమాన్ కి చెప్పారంట.ఇలా ఇండస్ట్రీ లో కొన్ని గ్రూపులు ఉన్నాయి, నా దగ్గరకి మంచి సినిమాలు వస్తే చేస్తాను కానీ ఇలాంటి గ్రూపుల వలన అసలు నా దగ్గరకు కథలే రావట్లేదు అని చెప్పుకొచ్చారు ఏ ఆర్ రెహమాన్. దీని బట్టి చూస్తుంటే ఇండస్ట్రీ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఇంటర్వ్యూ ని ఒక డైరెక్టర్ షేర్ చేసిన కూడా దాని పై రెహమాన్ ఇలాంటి వాటిపై టైం వేస్ట్ చేసుకోవద్దని ఒక మంచి సహృదయంతో రిప్లై ఇచ్చారు.
‘పోయిన డబ్బు తిరిగి వస్తుంది, కీర్తి తిరిగి వస్తుంది కానీ ఇలాంటి విషయాలపై మనం వెచ్చించే టైం తిరిగిరాదు, ముందుకు వెళదాం, మనం సాధించాల్సింది చాలా ఉంది’ అని చాలా హుందా అయిన సమాధానం ఇచ్చారు.