మూవీడెస్క్: రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న SSMB29 సినిమా పై ఆసక్తి రోజు రోజుకూ మరింత పెరుగుతోంది.
ఈ చిత్రం అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో కొనసాగే కథగా, ప్రపంచస్థాయి అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుందట.
మహేష్ బాబు ఈ సినిమాలో వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నారట.
ఇప్పటికే మహేష్ బాబు తన లుక్ లో మార్పులు చేసుకుంటూ, లాంగ్ హెయిర్, ఫుల్ గెడ్డంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
అయితే, గత చిత్రాల్లో రాజమౌళి తన హీరోల లుక్స్ ను గోప్యంగా ఉంచేవారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా లిమిట్స్ ఏమి పెట్టలేదు.
దీనికి కారణం రాజమౌళి ఒక కొత్త ప్లాన్ తో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మహేష్ బాబు లుక్ ఇంకా ఫైనల్ కాలేదు. లాంగ్ హెయిర్ మరియు గెడ్డం ఇంకాస్త పెరిగిన తరువాత మళ్ళీ దాన్ని పాత్రకు తగ్గట్టుగా మార్చే అవకాశం ఉందట.
అంటే ఎక్కువగా హెయిర్ పెరిగినా పర్లేదట. తరువాత లుక్ కు తగ్గట్టుగా కట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇక, ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.