మూవీడెస్క్: దేవర సినిమా విడుదలకు ముందే, ఓటీటీ స్ట్రీమింగ్ పై తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ రిలీజ్ అనేది చాలా ముఖ్యమైన బిజినెస్ గా మారింది.
టాక్ బాగుంటే ఆలస్యంగా ఓటీటీ లోకి వస్తున్నాయి. లేదంటే రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈ క్రమంలో, హిందీ మార్కెట్ లో మల్టీప్లెక్స్ థియేటర్ల నిబంధనల ప్రకారం 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అనేది తప్పనిసరి.
ఇటీవల ప్రభాస్ కల్కి 2898ఏడీ కూడా ఈ నిబంధనలనే పాటించింది. ఇప్పుడు దేవర నిర్మాతలు కూడా ఇదే రూట్ లో నడవాలని నిర్ణయం తీసుకున్నారు.
నార్త్ ఇండియాలో భారీ కలెక్షన్లు సాధించడానికి, మల్టీప్లెక్స్ స్ట్రాటజీకి అనుగుణంగా సినిమా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని వారు భావించారు.
తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే దేవర భారీ అడ్వాన్స్ బుకింగ్స్ సొంతం చేసుకుంది.
తొలిరోజు టాక్ బట్టి సినిమాకు భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక 8 వారాల థియేట్రికల్ రన్ తరువాత దేవర ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.