fbpx
Friday, October 18, 2024
HomeAndhra Pradeshమాజీ మంత్రి బొత్సకు సోదరుడి షాక్: జనసేనలోకి లక్ష్మణరావు?

మాజీ మంత్రి బొత్సకు సోదరుడి షాక్: జనసేనలోకి లక్ష్మణరావు?

Former – minister- Botsaku’s- brother’s- shock- Lakshmana- Rao- into- Janasena

ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి బొత్సకు సోదరుడి షాక్: జనసేనలోకి లక్ష్మణరావు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు తన సొంత సోదరుడు లక్ష్మణరావు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. లక్ష్మణరావు త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు విజయనగర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన జనసేన నేతలతో పలుమార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. దసరా పండుగ ముందు లేదా తరువాత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.

లక్ష్మణరావు గత పది సంవత్సరాలుగా వ్యాపారరంగంలో ఉన్నా, రాజకీయాల్లో ప్రవేశించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేశారు. తన అన్న బొత్స సత్యనారాయణ లాగా వైసీపీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని ఆశించినా, అతనికి అక్కడ నుంచి సరైన అవకాశం లభించలేదు. అలాగే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడికి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమికి లక్ష్మణరావు ప్రమేయం ఉందని, ఈ క్రమంలో వైసీపీతో ఆయన దూరం పెరిగిందని తెలుస్తోంది.

తన అనుచరులుగా ఉన్న కొన్ని సర్పంచులను జనసేనలోకి చేర్చడంతో పాటు, కూటమి విజయానికి పరోక్షంగా సహకరించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. మొదటగా టీడీపీలో చేరాలనుకున్న లక్ష్మణరావు, వైసీపీ ఎన్నికల పరాజయం అనంతరం, చివరికి జనసేనలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఆయన త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని చర్చ జరుగుతోంది.

ఈ పరిణామం బొత్స సత్యనారాయణకు వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా కష్టకాలాన్ని తెచ్చిపెట్టే అవకాశముంది. తన సొంత సోదరుడు ప్రత్యర్థి పార్టీతో కలవడం, విజయనగర జిల్లాలో వైసీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎక్కువ శాతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా.. దీన్లో మరో కోణం కూడా లేకపోలేదని, వాళ్ళ సొంత వ్యాపార అవసరాల కోసం అధికార పార్టీ వెన్నుదన్నుల కోసం అన్నదమ్ముల రాజకీయంలో ఇదొక భాగం అనే గుస గుసలు కూడా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular