మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా మొదటి రోజే భారీ రెస్పాన్స్ అందుకుంది.
సాలీడ్ వసూళ్లు సాధించి, ఎన్టీఆర్ కెరీర్‌లోనే సోలోగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన సినిమా గా నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్యాన్స్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఫిదా అయ్యి సినిమాను పొగుడుతున్నారు. అయితే, సాధారణ ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.
మాస్ ఆడియన్స్ కి మాత్రం సినిమా నచ్చుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇప్పటికే దేవరపై ఒక సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది.
ఎన్టీఆర్ తొలి బ్లాక్ బస్టర్ స్టూడెంట్ నెంబర్ 1 కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం లాంగ్ రన్‌లో విజయం సాధించింది.
ఇప్పుడు దేవర కూడా మొదట మిశ్రమ స్పందనలు అందుకున్నప్పటికీ, వారాంతంలో సూపర్ హిట్ గా నిలిచే అవకాశముందని అనుకుంటున్నారు.
దసరా సెలవులు మొదలవ్వడంతో, దేవర సినిమాకి అదనపు బలంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.