మూవీడెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
‘గని’, ‘గాండీవదారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలు వరుసగా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారడంతో, ఈ సారి సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
ప్రస్తుతం పీరియాడికల్ జోనర్‌లో ‘మట్కా’ టైటిల్ తో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది.
అంతేకాక, వరుణ్ తేజ్ త్వరలో క్రైమ్ కామెడీ జోనర్‌లో కూడా అడుగుపెట్టబోతున్నాడు.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కనకరాజు’ అనే టైటిల్ తో సినిమా చేయనున్నాడు.
ఈ చిత్రాన్ని క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సౌత్ కొరియాలో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
‘కనకరాజు’ మూవీ నవంబర్‌లో షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆశలు పెట్టుకున్నాడు.
ఇదే కాకుండా, ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో కూడా వరుణ్ మరో చిత్రం చేయనున్నాడు.