మూవీడెస్క్: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్లు అధికారికంగా మొదలయ్యాయి.
సినిమా పట్ల ఇప్పటి వరకు పెద్దగా ఆసక్తి కనిపించకపోయినా, నిర్మాత దిల్ రాజు దీని పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఈ మూడు నెలల్లో ప్రమోషన్ల ద్వారా సినిమాకు మంచి హైప్ తీసుకొస్తామని చెప్పారు. సెకండ్ సింగిల్ ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, సెప్టెంబర్ 30న ఈ సాంగ్ విడుదలవుతోంది.
అదే సమయంలో, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ దిల్ రాజుతో మాట్లాడినప్పుడు, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ‘గేమ్ చేంజర్’ విడుదల చేస్తామని దిల్ రాజు వెల్లడించారు.
అక్టోబర్ లో టీజర్ విడుదల చేయబోతున్నామని, అలాగే అక్టోబర్ 2న థర్డ్ సింగిల్ విడుదల చేయాలని కూడా ప్లాన్ చేసినట్లు చెప్పారు.
ఈ మూడు నెలల్లో ఎప్పటికప్పుడు మూవీ నుండి అప్డేట్లు వస్తుంటాయని ఆయన హామీ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ ఫెయిల్యూర్ తర్వాత, గేమ్ చేంజర్ పై శంకర్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారంట.
ముఖ్యంగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా జాగ్రత్తగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సారి ఎలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా సినిమాని సిద్ధం చేస్తున్నారు.