fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsబంగ్లాదేశ్ కథలో ఎన్టీఆర్

బంగ్లాదేశ్ కథలో ఎన్టీఆర్

NTR-TO-ACT-IN-BANGLADESH-BASED-STORY-BY-PRASHANTH-NEEL
NTR-TO-ACT-IN-BANGLADESH-BASED-STORY-BY-PRASHANTH-NEEL

మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో కూడా భారీ అంచనాలు పెంచింది.

ఈ ప్రాజెక్ట్ ఓ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగబోతోందట.

కథలో ఎన్టీఆర్ బంగ్లాదేశ్ కు వలస వెళ్లిన తెలుగు సమాజం కోసం పోరాడే నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

ఈ లైన్ “ఆంధ్రవాలా” మూవీ తరహాలో ఉన్నా, ప్రశాంత్ నీల్ యాక్షన్ డోస్‌తో మరింత మాస్ ఎలివేషన్ ఇచ్చి ప్రేక్షకులను అలరించనున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రవిబస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ ఉంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఇక అది పూర్తయ్యాక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular