fbpx
Wednesday, February 5, 2025
HomeBig StoryMUDA: ప్లాట్లను తిరిగి స్వీకరించడానికి అంగీకారం!

MUDA: ప్లాట్లను తిరిగి స్వీకరించడానికి అంగీకారం!

MUDA-ACCEPTED-SITE-RETURNS-BY-SIDDARAMAIAH-WIFE-PARVATHI
MUDA-ACCEPTED-SITE-RETURNS-BY-SIDDARAMAIAH-WIFE-PARVATHI

బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య నుండి వివాదాస్పదంగా మారిన 14 ప్లాట్లను తిరిగి స్వీకరించడానికి అంగీకారం తెలిపింది.

ఈ వివాదంపై భారీ దుమారం చెలరేగడంతో పాటు స్కాంగా అభియోగాలు వచ్చిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య బి.ఎన్. పార్వతి ంఊడాకు లేఖ రాశారు.

ఆమె తన మనసాక్షిని అనుసరిస్తూ ప్లాట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

విజయనగర్ 3వ, 4వ దశలో ఉన్న ఈ ప్లాట్లు మైసూరులో ప్రధాన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.

కేసారే గ్రామంలో ఉన్న 3.16 ఎకరాల భూమి వినియోగానికి బదులుగా ఈ ప్లాట్లు కేటాయించబడ్డాయి.

కాగా, ఈ కేటాయింపుతో రాష్ట్రానికి రూ. 45 కోట్ల నష్టం జరిగిందని ఒక అవినీతి వ్యతిరేక కార్యకర్త ఫిర్యాదు చేశారు.

ఈ స్కాంపై లోకాయుక్తా మరియు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్దరామయ్యపై కేసులు నమోదు చేశాయి.

అయితే, మంగళవారం MUDA కమిషనర్ ఎ.ఎన్. రఘునందన్ మాట్లాడుతూ, “చట్టంలోని నిబంధనల ప్రకారం, ఈ ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు.

మేము న్యాయవాదుల కమిటీతో చర్చించి, ప్లాట్లను తిరిగి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ క్రమంలో విక్రయ పత్రాన్ని రద్దు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం” అని చెప్పారు.

“ఇది విచారణతో సంబంధం లేదు. ఈ ప్లాట్లను మరొకరికి కేటాయించే అవకాశం ఉందా అనే విషయంలో విచారణాధికారులకు సమాచారం అందిస్తాం.

చట్టంలో అందుకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయి. మేము ఈ విషయాన్ని లోకాయుక్త మరియు ఇతర విచారణ అధికారులకు తెలియజేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular