మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామా షూటింగ్ నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
ఇటీవలే విజయవాడలో పాత బంగ్లాలో సెట్స్‌లో చిత్రీకరణ రీస్టార్ట్ చేశారు. ఇప్పటికే 2025 మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
కానీ, షూటింగ్ మళ్లీ బ్రేక్‌కి గురైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కేవలం మూడు రోజులు మాత్రమే సెట్స్‌లో పాల్గొన్నారని, తిరుమలలో దీక్షకు సంబంధించిన కారణాలతో తిరిగి షూటింగ్‌కు హాజరుకావడం లేదని సమాచారం.
తిరుమల దీక్ష పూర్తి చేసుకున్న పవన్, తిరిగి విజయవాడలో షూటింగ్‌లో పాల్గొంటారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇది కేవలం చిన్న బ్రేక్ మాత్రమేనని, షూటింగ్ త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుందని అంటున్నారు.
బాబీ డియోల్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
దీపావళి కానుకగా సినిమా నుంచి పాట విడుదల కానుందని, కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నారని టాక్ వినిపిస్తోంది.