fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsరామ్ చరణ్ 16.. భారీ స్క్రిప్ట్ ప్లానింగ్

రామ్ చరణ్ 16.. భారీ స్క్రిప్ట్ ప్లానింగ్

RAMCHARAN-16-SCRIPT-DESIGNING-WITH-HUGE-BUDGET
RAMCHARAN-16-SCRIPT-DESIGNING-WITH-HUGE-BUDGET

మూవీడెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇటీవల వచ్చిన టాక్ ప్రకారం, RC16 స్క్రిప్ట్ కోసం మేకర్స్ ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అనుభవజ్ఞులైన రచయితల బృందం ప్రస్తుతం స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.

ఈ నెలలో షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ముందు, స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఈ చిత్రానికి మూడు పాటలు కంపోజ్ చేశారట.

రెహమాన్ సంగీతం ఈ ప్రాజెక్ట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఫ్యాన్స్‌లో అంచనాలు ఉన్నాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రంలో భాగస్వాములుగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular