మూవీడెస్క్: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, తన సంగీతంతో సౌత్ ఇండియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనిరుధ్, ఆ తర్వాత ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలకు సంగీతం అందించి మరింత క్రేజ్ పెంచుకున్నాడు.
ఇటీవల ‘దేవర’ సినిమాతో మళ్ళీ తన ప్రత్యేక శైలిని ప్రదర్శించిన అనిరుధ్, ఆ సినిమాలో పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకుల మెప్పు పొందాడు.
ఇక నేచురల్ స్టార్ నాని తో మరలా అనిరుధ్ కాంబో రిపీట్ కానుందనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
‘దసరా’ తో నాని, శ్రీకాంత్ ఓదేల సూపర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమాకు ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి అనిరుధ్ సంగీతం అందిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాపై ఇప్పటికే నాని క్లారిటీ ఇచ్చాడు. ‘హిట్ 3’ పూర్తి అయిన వెంటనే శ్రీకాంత్ ఓదేలతో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్ళబోతోంది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ ఎంపిక అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.