మూవీడెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద వివాదానికి దారితీశాయి.
హీరో నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని సురేఖ చేసిన వ్యాఖ్యలు అనేక మంది సినీ ప్రముఖులను మండిపడేలా చేశాయి.
తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె ఇటీవల క్షమాపణలు చెప్పినా, దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
ఆర్జీవీ మాట్లాడుతూ, “సమంతకు సురేఖ క్షమాపణ చెప్పడంలో ఆవేశం, స్టుపిడిటీ మించిపోతోంది. సురేఖ నాగార్జున, నాగ చైతన్యను అవమానించారు కానీ సమంతను కాదు.
నాగ చైతన్య, నాగార్జున మీద తీవ్ర ఆరోపణలు ఉన్నా, అందరూ సైలెంట్ గా ఉన్నారు. కుటుంబ గౌరవం దెబ్బతిన్నా, ఎవరూ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు.
ఆర్జీవీ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు జరగకుండా అక్కినేని కుటుంబం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ వివాదం అక్కినేని కుటుంబ గౌరవానికి, టాలీవుడ్ కి సంబంధించిన సున్నితమైన అంశమని, నాగార్జున, నాగ చైతన్యలు ఇంతటితో వదిలిపెట్టకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.