మూవీడెస్క్: మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడటం, షోల్డర్ సర్జరీ చేయించుకోవడం సినీ అభిమానులకు తెలిసిందే.
డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించగా, రవితేజ ఆ సలహాను పాటించి కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకున్నారు.
ఇక రవితేజ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌కి రావడానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం, రవితేజ అక్టోబర్ 14 నుండి RT75 షూటింగ్ లో పాల్గొననున్నారు.
భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.
ఈ చిత్రంలో రవితేజకు జోడీగా శ్రీలీల నటించనుండటం మరో ప్రత్యేకత. ధమాకా తర్వాత ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మొదట సంక్రాంతి 2025లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు రావడంతో విడుదల తేదీకి మార్పు వచ్చే అవకాశం ఉందని టాక్.
రవితేజ ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు, ఎందుకంటే గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు.
ఇప్పుడు, అభిమానులు మాస్ మహారాజ్‌ను మళ్లీ విజయం దిశగా నడిచేలా చూడాలని ఎదురు చూస్తున్నారు.