fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsకమల్ హాసన్ థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ లేటెస్ట్ అప్డేట్

LATEST-NEWS-ON-KAMAL-HASSAN-THUG-LIFE
LATEST-NEWS-ON-KAMAL-HASSAN-THUG-LIFE

మూవీడెస్క్: విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం థగ్ లైఫ్ అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ వంటి హిట్ తర్వాత కమల్‌తో కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నందున, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

1987లో వచ్చిన ‘నాయగన్’ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ కలవడంతో సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ మూడు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించబోతున్నారు.

రీసెంట్ గా సినిమా షూటింగ్ పూర్తయిందని, కమల్ తన డబ్బింగ్ కూడా ముగించారని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.

ఈ చిత్రంలో త్రిష, శింబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఐశ్వర్య లక్ష్మి, జయం రవి, పంకజ్ త్రిపాఠి, నాజర్ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రంలో నటిస్తుండడం మరో విశేషం.

రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో ఆకర్షణ.

థగ్ లైఫ్ 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular