fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsరజినీకాంత్ న్యూ మూవీ.. ప్రమోషన్స్ లేకుండానే..

రజినీకాంత్ న్యూ మూవీ.. ప్రమోషన్స్ లేకుండానే..

VETTAIYAN-RELEASE-ON-OCTOBER-10-WITHOUT-MUCH-PROMOTIONS
VETTAIYAN-RELEASE-ON-OCTOBER-10-WITHOUT-MUCH-PROMOTIONS

మూవీడెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్ 73 ఏళ్ల వయస్సులో కూడా తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

రజినీకాంత్ నటించిన తాజా సినిమా వేట్టయన్ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

టీజే జ్ఞాన్‌వేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది.

అమితాబ్ బచ్చన్, ఫాహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు, దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా విడుదలైన వేట్టయన్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే “మనసిలాయో” పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే, రజినీకాంత్ ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోతున్నారు. రీసెంట్‌గా హాస్పిటల్ లో చేరిన రజినీ, ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇప్పటి వరకు సైలెంట్‌గా సినిమాను ప్రమోట్ చేస్తుండగా, సూపర్ స్టార్ ఇమేజ్‌తోనే చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

రజినీకాంత్ ప్రమోషన్ లో భాగస్వామ్యం లేకున్నా, కంటెంట్ మీద నమ్మకంతో సినిమా విడుదల చేయబోతున్నారు.

ఈ దసరా సెలవుల్లో విడుదల కాబోతున్న పెద్ద సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular