హైదరాబాద్: ఫామ్ హౌస్ వివాదం ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై చేసిన వ్యాఖ్యలు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్‌లు అక్రమంగా నిర్మించబడ్డాయని, అవి కూడా కూల్చాలా లేదా అని ఆయన ప్రశ్నించారు.
సబితమ్మకు ముగ్గురు కొడుకులు ఉన్నారని, వారికి ఫామ్ హౌస్‌లు ఉన్నాయా లేదా అని ప్రశ్నించారు. అవి కూడా బఫర్ జోన్‌లో ఉన్నాయని తనకు సమాచారం ఉందని అన్నారు.
ఇక, హరీష్ రావుపై కూడా రేవంత్ సెటైర్లు వేశారు. ఆయన ఫామ్ హౌస్ కూడా అక్రమంగా నిర్మించబడిందని, అజిజ్‌పూర్‌లో ఉన్న ఆ ఫామ్ హౌస్‌పై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
సబితా ఇంద్రారెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. తాము ఎక్కడ ఫామ్ హౌస్‌లు కట్టుకున్నామో చూపించాలని, తమకు ఆస్తులు కాకుండా ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పారు.
రేవంత్ తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తారని సబిత పేర్కొన్నారు.
ఇలాంటి ఆరోపణలను తాము పట్టించుకోమని, రాజకీయంగా ఎదురు దెబ్బలు తిన్నా కూడా, తాము ఎప్పుడూ గౌరవంగా వ్యవహరిస్తామని సబిత తెలిపారు.