మూవీడెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ విజయ్ 69 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా విజయ్ కెరీర్‌లో చివరి ప్రాజెక్ట్ అవుతుందనే టాక్ కూడా ఉంది.
ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఇటీవలే చెన్నైలో ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకుడు హెచ్ వినోథ్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుండగా, చిత్రంలో నటించే నటీనటుల పేర్లు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు.
హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేయగా, మరో హీరోయిన్‌గా మమితా బైజు నటించనున్నారు. విలన్‌గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించనున్నారు.
గౌతమ్ వాసుదేవ మీనన్, నరైన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మేకర్స్ విడుదల చేసిన మొదటి పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది, “ప్రజాస్వామ్యానికి టార్చ్ బేరర్” అనే క్యాప్షన్ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచింది.
విజయ్ 69 సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.