మూవీడెస్క్: స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌కి తోడు వ్యాపారాల్లో కూడా కొత్త అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే ఫ్యాషన్, హోటల్స్, స్కూల్స్ వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టిన సమంత, రీసెంట్‌గా స్పోర్ట్స్ బిజినెస్‌లోకి కూడా ప్రవేశించారు.
చెన్నై ఫ్రాంచైజీని వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో కొనుగోలు చేసిన ఆమె ఇప్పుడు మరో వ్యాపారంలో భాగస్వామిగా మారారు.
తాజాగా వెల్‌నెస్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ కి సహ వ్యవస్థాపకురాలిగా సమంత చేరారు.
ఆరోగ్యం కోసం అరోమా థెరపీకి తన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిందో గుర్తు చేస్తూ, సమంత ఈ బ్రాండ్‌లో భాగం కావడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ముఖ్యమని తెలిపారు.
అనారోగ్యంతో బాధపడినప్పుడు ఈ ప్రోడక్ట్ ఆమెకు ఎంత సాయం చేసిందో వివరించారు.
సీక్రెట్ ఆల్కెమిస్ట్ తాజాగా విస్తరణ లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
క్రీములు, మిస్టులు, షవర్ జెల్స్ వంటి కొత్త ప్రోడక్ట్స్ ని విడుదల చేయాలని బ్రాండ్ నిర్ణయించింది.
ఇప్పుడు సమంత ఈ వెల్‌నెస్ బ్రాండ్‌కి కో ఫౌండర్‌గా మారడంతో, ఆమె వ్యాపార రంగంలో మరింత ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.