టాలీవుడ్: అసలు సినిమా షూటింగ్స్ చెయ్యడానికి చేసిన సినిమాలని విడుదల చెయ్యడానికి నిర్మాతలు, హీరోలు కష్టపడుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలు తీసి విడుదల చేస్తున్నాడు. మొన్ననే పవర్ స్టార్ట్ సినిమా పది రోజుల్లో ముంగించి విడుదల చేసిన వర్మ ఇపుడు మర్డర్ సినిమా ట్రైలర్ విడుదల చేసాడు. కొన్ని రోజుల్లో సినిమా ఓటీటీల్లో విడుదల అవబోతున్నట్టు చెప్పారు. వివాదాలే కేంద్రంగా ఉండే వర్మ, ప్రస్తుతం జరుగుతున్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని జనాల్లో బాగా నానిన ఇష్యూ ని బేస్ చేసుకొని సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ అనే సినిమా ప్రకటించి దానికి ఇది ‘కుటుంబ కథా చిత్రమ్’ క్యాప్షన్ కూడా పెట్టారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయి కులాంతర వివాహం చేసుకున్న తర్వాతి పరిస్థితులను ఈ చిత్రంలో వర్మ చూపించారు. కూతురిపై ప్రేమ – సమాజంలో పరువు గురించి ఆలోచిస్తూ వాటి మధ్య నలిగిపోయిన తండ్రి మానసిక వేదనే ఈ సినిమా. ”పిల్లల్ని ప్రేమించడం తప్పా?.. తప్పు చేస్తే దండించడం తప్పా?.. వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?.. పిల్లల్ని కనగలం గాని వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి” అంటూ ట్రైలర్ లో కొన్ని ప్రశ్నలని సంధించాడు. మిర్యాలగూడకు చెందిన కూతురు అమృత.. ప్రణయ్ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. అయితే మారుతీరావు కూడా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఇదే రామ్ గోపాల్ వర్మకి కథలా మారింది. ‘మర్డర్’ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. మొన్న విడుదలైన పవర్ స్టార్ కన్నా సినిమా కొంచెం టెక్నికల్ అంశాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పడానికి మెట్లని సెంటర్ చేస్తూ జూమ్ అవుట్ చేసే ఒక సీన్ ఒకటి చూస్తే అర్ధం అవుతుంది.
trailer looks like one sided story. we want both point of views.