భారతదేశంలో టాప్ 10 సంపన్న రాష్ట్రాలు: 2023-24లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) ఆధారంగా పది సంపన్న రాష్ట్రాల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మహారాష్ట్ర రూ.42.67 లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా సంపన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ మరియు పారిశ్రామిక వేత్తలతో పాటు, మహారాష్ట్రకి ఉన్న ప్రాధాన్యత ఈ స్థానం సాధించేందుకు కారణమైంది.
రెండో స్థానంలో తమిళనాడు రూ.31.55 లక్షల కోట్లతో నిలిచింది, ఆ తర్వాత కర్ణాటక రూ.28.09 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ రూ.27.09 లక్షల కోట్లతో నాలుగో స్థానం, ఉత్తరప్రదేశ్ రూ.24.99 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి.
తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ రూ.16.05 లక్షల కోట్లతో 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ రూ.15.89 లక్షల కోట్లతో 9వ స్థానంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రూ.15.22 లక్షల కోట్లతో టాప్ 10లో నిలిచిన మరొక రాష్ట్రం.
భారత ఆర్థిక వ్యవస్థ 2030-37 నాటికి దాదాపు రెండింతలు పెరిగి 7 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంటుందని ఎస్ అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.