దుబాయ్: దుబాయ్ వేదికగా జరుగుతున్న 2024 Icc Women’s T20 World Cup లో పాకిస్తాన్‌పై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకోగా, వారి బ్యాటర్లు నిరాశపరిచారు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 105/8 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లు శ్రేయాంక పటిల్ (2/12), అరుందతీ రెడ్డి (3/19) ప్రభావశీలమైన ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టును కట్టడి చేయగలిగారు.
భారత జట్టు బ్యాటింగ్‌లో మొదటి భాగంలో జాగ్రత్తగా ఆడింది. టాప్ ఆర్డర్‌లో షఫాలి వర్మ 35 బంతుల్లో 32 పరుగులు చేసింది.
జట్టుకు విజయాన్ని అందించే క్రమంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 24 బంతుల్లో 29 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడారు.
చివరికి, 18.5 ఓవర్లలో 106 పరుగుల లక్ష్యాన్ని సాధించి, తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది భారత జట్టు.
పాకిస్తాన్ జట్టులో నిదా దార్ 34 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేసింది.
కానీ భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు పాకిస్తాన్ కేవలం 105 పరుగులకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్తాన్: 105/8 (20 ఓవర్లలో; నిదా దార్ 28; శ్రేయాంక పటిల్ 2/12, అరుందతీ రెడ్డి 3/19).
భారత్: 106/4 (18.5 ఓవర్లలో; షఫాలి వర్మ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ రిటైర్డ్ హర్ట్ 29; ఫాతిమా సనా 2/23).