మూవీడెస్క్: టాలీవుడ్‌లో మెగా హీరోల ఫ్యామిలీ నుంచి వస్తోన్న హీరోల వరుస సినిమాలు మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వనున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి మొదలవుతున్న ఈ భారీ లైన్ అప్, అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.
కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మట్కా’ నవంబర్ 14న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.
అంతే కాదు, ఆ తర్వాత డిసెంబర్ 6న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా ఇప్పటికే భారీ బజ్ సొంతం చేసుకుంది. ఇక క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ మూవీ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ కానుంది.
జనవరి 10 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’ థియేటర్స్‌లో సందడి చేయబోతోంది.
ఈ లైన్ అప్ మొత్తం చూస్తే, నాలుగు పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్‌కు ఈ పండగ సీజన్ మరింత గ్రాండ్‌గా మారబోతోంది.