మూవీడెస్క్: ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
తాజాగా, మమ్ముట్టి కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ, ఇది నిజమైతే సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
ఇక ప్రభాస్, ఈ సినిమాలో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే కథలో ఆయనకు కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని సమాచారం.
సందీప్ రెడ్డి వంగా తన సిగ్నేచర్ స్టైల్ లో కథను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారని టాక్.
ఈ భారీ బడ్జెట్ మూవీ రూ.400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మితమవుతోంది.
టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ 2024లో ప్రారంభం కానుంది.