మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, పవన్ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా పక్కా ఎంటర్టైనర్ గా రాబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, విడుదల ఈ ఏడాదిలో కుదరలేదు. వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఓజీ’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి, పవన్ ఫ్యాన్స్‌కి ఆనందం కలిగించారు.
వరుణ్ తేజ్ తన సినిమా ‘మట్కా’ టీజర్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ, ‘ఓజీ’ కథను తాను పవన్ కళ్యాణ్ కంటే ముందే విన్నానని వెల్లడించాడు.
ఆ సినిమా ఎప్పుడు వచ్చినా పవన్ అభిమానులకు పండగే అని.. అంచనాలకు మించి ఉంటుందని చెప్పాడు.
‘ఓజీ’ ఆలస్యమైనా, అభిమానులు ఓపికతో ఎదురు చూడాలని, కంటెంట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందని వరుణ్ తేజ్ ధీమాగా చెప్పాడు.
ఈ మాటలు మెగా ఫ్యాన్స్‌కి కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఇక ‘మట్కా’ గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం కూడా అభిమానులను నిరాశ పరచదని, ఇది మాస్ జాతరలా ఉంటుందని వరుణ్ తేజ్ తెలిపాడు.
కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.