మూవీడెస్క్: అఖండ 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అఖండ వరల్డ్‌వైడ్‌గా రూ. 133.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది, ఇది బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్.
ఇప్పుడు బోయపాటి శ్రీను ఈ సినిమా సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘అఖండ 2’ (AKHANDA 2) స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని సమాచారం.
2025 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సీక్వెల్‌ను 150 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇక ఈ సీక్వెల్లో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారని టాక్. ప్రతినాయకుడి పాత్ర కోసం ఈశాన్య రాష్ట్రాల వ్యక్తిని లేదా చైనా యాక్టర్‌ని తీసుకునే ఆలోచనలో ఉన్నారని వినిపిస్తోంది.
బాలయ్య కోసం బోయపాటి హై రేంజ్లో డైలాగ్స్ రాస్తున్నారట. బాలయ్య బాబీతో చేస్తోన్న ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.