fbpx
Friday, October 18, 2024
HomeMovie NewsPVCU 3: ప్రశాంత్ వర్మ క్రేజీ అప్డేట్

PVCU 3: ప్రశాంత్ వర్మ క్రేజీ అప్డేట్

CRAZY-UPDATE-FROM-PRASANTH-VARMA-PVCU-3
CRAZY-UPDATE-FROM-PRASANTH-VARMA-PVCU-3

మూవీడెస్క్: టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించాడు.

ఈ సూపర్ హీరో సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దేశవ్యాప్తంగా రికార్డులు నెలకొల్పింది. ఈ విజయంతో, ప్రశాంత్ వర్మ తన సొంత సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU) ను ఏర్పరిచారు.

ఇందులో 10 సూపర్ హీరో చిత్రాలను తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ మరియు కళ్యాణ్ దాసరి హీరోగా ‘అధీరా’ అనే సినిమాలను ప్రకటించారు.

అయితే, ప్రశాంత్ వర్మ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 10న PVCU 3 పైన ఒక పవర్‌ఫుల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

“నవరాత్రి సందర్భంగా, పవర్ అండ్ మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ ప్రశాంత్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పేర్కొన్నారు.

ఇది ‘జై హనుమాన్’కి సంబంధించిన అప్డేట్ అవుతుందా లేక ‘అధీరా’ పైన ఉంటుందా అన్నది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

ఏదైనా, PVCU 3 ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారో అనే ఆసక్తి కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular